పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన అంశం
పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. ఈ విషయంలో వందం శాతం ఆలోచించుకోవాల్సి ఉంటుందని నటి జెనీలియా అంటున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ తదితర భాషల్లో హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపును, క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ నవ్వుల రాణి విజయ్ సరసన నటించిన వేలాయుధం ఇటీవలే విడుదలై విజయ వంతంగా ప్రదర్శింపబడుతోంది. అలాగే మలయాళంలో నటించిన ఉరువి చిత్రం త్వరలో కోలీవుడ్‌లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బహుభాషా నాయకితో చిన్న భేటీ...
ప్ర : కోలీవుడ్, టాలీవుడ్‌లలో మంచి క్రేజ్ ఉన్నా బాలీవుడ్‌కే అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారనే ఆరోపణలకు మీ సమాధానం?
జ : నేనిప్పుడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాను. అవకాశాలను వెతుక్కుంటూ ఎప్పుడూ వెళ్లలేదు. తమిళంలో ఉత్తమ పుత్రన్, సంతోష్ సుబ్రమణియన్, వేలాయుధం వంటి మంచి అవకాశాలు వచ్చినప్పుడు నిరాకరించలేదు. అలాగే ఇకపై కూడా మంచి పాత్రల్లో నటించే అవకాశం వస్తే వదులుకునే ప్రసక్తే లేదు.
ప్ర : మీ లక్ష్యం ఏమిటి?
జ : నేను కీర్తి కనకాల కంటే వృత్తినే ప్రేమిస్తాను. నేను నటించిన చిత్రాల గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు, సన్నివేశాలను ప్రశంసించినా ఆనందిస్తాను. నా వృత్తినే నాకు ప్రశాంతతను చేకూర్చుతుంది. దీనికి మించి లక్ష్యం అంటూ ఏమీ లేదు. పొగడ్తలంటే నాకు నచ్చవు. అవి చాలా డేంజర్.
ప్ర : హిందీ చిత్రం ఫోర్స్‌లో అందాలు ఆరబోశారట?
జ : ఈ విషయంలో ప్రచారం కాస్త అధికంగానే జరుగుతోందనాలి. ఈ చిత్ర హీరో జాన్ అబ్రహాం నేను పెళ్లి చేసుకున్నట్లు కూడా మీడియా ప్రచారం చేసింది. ఇన్‌ఫోర్స్ చిత్రంలో పాత్రకు అవసరమైనంత సన్నిహితంగా నటించాం. ఎక్స్‌పోజింగ్ విషయంలోనూ పాత్ర డిమాండ్ మేరకే నటించాను.
ప్ర : మరి కొందరితో కలుపుతూ మీపై వదంతులు ప్రచారం అవుతున్నాయి?
జ : నా తొలి చిత్రం (హిందీ) రితేష్‌తో కలుపుతూ పలు గాసిప్స్ ప్రచారమవుతున్నాయి. ఇక్కడ మరో విషయం గురించి చెప్పాలి. నాకు సినిమా పరిశ్రమ ఎంత పవిత్రమైందో, నా సొంత జీవితం కూడా అంతే. నా వ్యక్తి గత జీవితం గురించి ఎవరితోను చర్చించదలచుకోలేదు. ఏ మగాడితోనూ సన్నిహిత సంబంధాలు లేవు.
ప్ర : వివాహం ఎప్పుడు చేసుకుంటారు?
జ : పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. ఈ విషయంలో నూరుకు నూరు శాతం ఆలోచిం చాలి. ఆ సమయం వచ్చినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను.
ప్ర : మీకు బాగా ఇష్టమైన నటుడెవరు?
జ : బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ మంచి క్రమశిక్షణ గల నటుడు. మా ఇద్దరి మధ్య పెద్దగా సాన్నిహిత్యం లేదు. నేను ఆయనతో కలిసి నటించిన జాను దుయా జాన్ చిత్రం మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని చాలా మంది అభినందించారు. ఇక దక్షిణాదిలో సిద్ధార్థ్ మంచి స్నేహితుడు.

Posted by mahaandhra
on 1:26 PM.
Filed under
feature,
HighLights
.
You can follow any responses to this entry through the RSS 2.0