Categories

Popular Posts

Blog Archive

ఒకే దెబ్బకు రెండు పిట్టలు



ఒక్క దెబ్బకు రెండు పిట్టలు! రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్‌ భావన ఇది!! ఒకరు తమ పార్టీని చీల్చేందుకు ఉరకలు వేస్తున్న వైఎస్సార్‌ కాం గ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌. మరొకరు తన పార్టీని మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునే యత్నం చేస్తున్న టీడీ పీ అధినేత చంద్రబాబునాయుడు. ఇప్పుడు ఇద్దరూ అక్ర మ ఆస్తులకు సంబంధించి సంకటంలో పడిన అగ్రనేత లు. వారిద్దరి ఇరకాటంతో ఇప్పటివరకూ నిస్తేజంగా ఉన్న తన పార్టీకి మంచిరోజులు వస్తాయని కాంగ్రెస్‌ ఆశిస్తోంది.

జగన్‌ అక్రమ ఆస్తుల కేసులపై మంత్రి శంకర్‌రావు, టీడీపీ నేత ఎర్రన్నాయుడు వేసిన పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు, వాటిపై విచారణ జరిపించాలని సీబీఐను ఆదే ేశించింది. అందులో భాగంగా.. వైఎస్‌ హయాంలో అనేక ‘మేళ్లు’ పొందిన కంపెనీలు, అందుకు కృతజ్ఞతగా జగన్‌కు చెందిన కంపెనీలలో పెట్టిన పెట్టుబడులపై సీబీఐ విచారణ జరుపుతోంది. వాటి యజమానులను పిలిపించి విచారి స్తోంది. అందులో కొందరు ఇప్పటికే అరెస్టయ్యారు. స్వయంగా జగన్‌ సైతం ఒకసారి గాలి జనార్దన్‌రెడ్డి కేసు లో వచ్చి హాజరయ్యారు.
జగన్‌పై సీబీఐ విచారణ నేపథ్యంలో ఆయనకు దన్నుగా నిలిచిన ఎమ్మెల్యేలలో పునరాలోచన మొదలయింది. తాజాగా స్పీకర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి, జగన్‌ వైపు వెళ్లిన ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. 10వ షెడ్యూల్‌ ప్రకారం ఒక పార్టీ నుంచి ఎన్నికయి, వేరే పార్టీలో చేరితే వారి శాసనసభ్యత్వం పోతుంది. ఆ ప్రకారంగా మొత్తం 32 మంది ఎమ్మెల్యేలలో నలుగురు మినహా మిగిలిన జగన్‌ వర్గ ఎమ్మెల్యేలంతా అనర్హులు కానున్నారు. దీనితో మళ్లీ వారంతా కాంగ్రెస్‌ బాట పడుతున్నారు. అంటే సీబీఐ విచారణతో కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యక్షంగా కలగనున్న ప్రయోజనమే. సీబీఐ విచారణ తర్వాత ఢిల్లీకి వెళ్లిన జగన్‌ ప్రధాని, శరద్‌పవార్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత సోనియాపైన మునుపటి వాడి తగ్గించడం అటుంచి, అసలు పూర్తిగా ఆమెను విమర్శిం చడమే మానుకున్నారు. కోర్టు ఆదేశాలతో జరుగుతున్న సీబీఐ విచారణ వల్ల కాంగ్రెస్‌కు ఆ రకంగా పరోక్ష రాజీ య ప్రయోజనం కలుగుతోంది.
ఇక గత కొద్దికాలం నుంచి కాంగ్రెస్‌ సర్కారుపై నిప్పులు చిమ్ముతూ, జనంలోకి వెళ్లి ప్రభుత్వ ప్రతిష్ఠను పలచన చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా తాజాగా హైకోర్టు చేతికి చిక్కడంతో కాంగ్రెస్‌ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆయన అక్రమ ఆస్తులపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో రాష్ట్రంలో ఇద్దరు ప్రధా న ప్రత్యర్థుల దృష్టి ఇకపై సర్కారు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మరలి, సొంత సమస్యలపై సారించే అవకాశం ఏర్పడింది.
ప్రధానంగా.. సర్కారుపై సమర శంఖం పూరిస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆస్తులపై కూడా సీబీఐ విచారణకు ఆదేశించటంతో ఇక రాష్ట్రంలో ఇద్దరు ముఖ్య నేతలు రాజకీయంగా, నైతికంగా దెబ్బతిన్న ట్లేనని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. దానితో వారిద్దరూ కాంగ్రెస్‌ పార్టీని దునుమాడటం బదులు, సొంత సమస్యలు పరిష్కరించుకోవడంలో దృష్టి సారిస్తారని కాం గ్రెస్‌ భావిస్తోంది. ఈ వ్యవహారం ఇద్దరికీ నైతిక సంకటమే కాబట్టి, వారిద్దరూ మళ్లీ చట్టపరంగా కోలుకునేలోగా తాము రాజకీయంగా, సంస్థాగతంగా లబ్థిపొందాలన్నది కాంగ్రెస్‌ లక్ష్యంగా కనిపిస్తోంది.
తెలంగాణ సమస్యతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రధాని చేసిన ప్రకటన ఊరట నిచ్చింది. తెలంగాణ రాదన్న సంకేతాలతో తెలంగాణలో ప్రత్యా మ్నాయం దిశగా యోచించే అవకాశం పార్టీకి ఏర్పడింది. అదే సమయంలో సీమాంధ్రలో కూడా బాబు, జగన్‌ సీబీఐ విచారణ వ్యవహారంతో ఆ రెండు పార్టీలు చప్పబడి పోయే క్రమంలో సంస్థాగతంగా తిరిగి పుంజుకునేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ఢిల్లీలో ప్రధానిని కలిసిన తర్వా త జగన్‌ గొంతు ఎలాగూ మూగబోయింది కాబట్టి, ఇక జగన్‌ నుంచి తమకు ఎలాంటి నష్టం ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నారు.ఈలోగా కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం, రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమా యత్తం చేయడం, కార్పొరేషన్‌ పదవుల భర్తీ, స్థానిక ఎన్నికలపై దృష్టి సారించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం సిద్ధమవుతోంది.

Posted by mahaandhra on 1:23 PM. Filed under . You can follow any responses to this entry through the RSS 2.0

0 comments for ఒకే దెబ్బకు రెండు పిట్టలు

Leave comment

Photo Gallery