చెర్రీ పెళ్లీ ఢిల్లీలో!
రామ్ చరణ్, ఉపాసనా కామినేనిల ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించడానికి సన్నాహాలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనూ, అటు అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్‌రెడ్డి ఇంట్లోనూ సందడి నెలకొందని తెలుస్తోంది. డిసెంబర్ 1న ఉదయం 10 గంటలకు ఈ వేడుక ఆరంభమవ్వనుందట. కరెక్ట్‌గా 11.55కు రామ్‌చరణ్ ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని ఉపాసనకి తొడగుతారని తెలుస్తోంది. గండిపేట సమీపంలోని గోల్కోండ రిసార్ట్‌సలో ఈ వేడుక జరగనుంది. తన నిశ్చితార్థానికి రావాలని చెర్రీ గవర్నర్ దంపతులను ఆహ్వానించిన విషయం విదితమే. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారని విశ్వసనీయ సమాచారం. కాగా చరణ్-ఉపాసనల పెళ్లి దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగనున్నట్లు తెలుస్తోంది. చరణ్ పెళ్లిని తన రాజకీయ వేదికగా ఉపయోగించుకోవడంలో భాగంగానే చిరంజీవి ఈ ప్లాన్ వేసినట్లు చర్చించుకుంటున్నారు.

