Categories

Popular Posts

Blog Archive

మరిన్ని పౌరాణికాలు: బాలకృష్ణ

బాపు దర్శకత్వంలో అందాల హరివిల్లుగా రూపుదిద్దుకుంటున్న ‘శ్రీరామరాజ్యం’ ప్రచారం వినూత్నంగా కొనసాగుతోంది. నటరత్న బాలకృష్ణ ఒక ప్రైవేట్‌ రేడియోలో శ్రీరామరాజ్యం చిత్రం విశేషాలగురించి రేడియో శ్రోతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు పౌరాణికాలు అంటే ఎంతో ఇష్టమన్నారు. అలాగే ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరిస్తే భవిష్యత్‌లో తన తండ్రి ఎన్టీఆర్‌ నటించిన ‘సీతారామ కళ్యాణం’, ‘శ్రీకృష్ణపాండవీయం’ లాంటి చిత్రాలను తీయాలని ఉందన్నారు. అలాగే గతంలో సౌందర్య మరణంతో ఆగిపోయిన ‘నర్తనశాల’ చిత్రాన్ని పునర్నిర్మించేందుకు సైతం కొందరు నిర్మాతలు వస్తున్నారన్నారు. మరో ఐదు సంవత్సరాల తర్వాతే తన కుమారుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం ఉంటుందని అన్నారు బాలకృష్ణ. ‘శ్రీరామరాజ్యం’ చిత్రం నేడు సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుని 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
ఈ చిత్రం విడుదలపై విదేశాలలో కూడా తెలుగువారు ఎదురుచూడటం విశేషం. ఓవర్‌సీస్‌ బిజినెస్‌ కూడా పూర్తయిందని సమాచారం. ఈ చిత్రం తాలూకు పోస్టర్లు ఇప్పటికే విడుదలై నెట్లో సందడిచేస్తున్నాయి. అంతా బాలకృష్ణ, నయనతార జంట గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రంలో ఇద్దరూ పోటాపోటీగా ఉన్నారని, ప్రచారం కూడా వినూత్నరీతిలో సాగుతోందని అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రం అత్యధిక కేంద్రాలలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు అభిమానులనేగాక అశేష శ్రోతలను కూడా అలరిస్తున్నాయి.

Posted by mahaandhra on 10:40 AM. Filed under . You can follow any responses to this entry through the RSS 2.0

0 comments for మరిన్ని పౌరాణికాలు: బాలకృష్ణ

Leave comment

Photo Gallery