Categories

Popular Posts

Blog Archive

సినిమా కోసం 'ఫే˜స్‌బుక్‌ ని వదులుకున్నా


'ఫే˜స్‌బుక్‌' సంస్థలో నెలకు లక్ష రూపాయల జీతమిచ్చే ఉద్యోగం ఒకవైపు- 'ఇట్స్‌ మై లవ్‌స్టోరి' చిత్రం ద్వారా లక్షలాది ప్రేక్షకులకు పరిచయమయ్యే గొప్ప అవకాశం మరోవైపు...ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు...రెండో అవకాశం వైపే మొగ్గు చూపా'నని అంటోంది 'నికిత నారాయణ'. 'ఇట్స్‌ మై లవ్‌స్టోరీ'లో హీరోయిన్‌గా పరిచయమైంది. మధుర శ్రీధర్‌ దర్శకత్వం వహించాడు. మల్టీడైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. సమర్పణలో, షిరిడిసాయి కంబైన్స్‌ పతాకంపై డా||యం.వి.కె. రెడ్డి నిర్మించారు. 'ఇట్స్‌ మై లవ్‌స్టోరి' విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా నడుస్తోందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హీరోయిన్‌ 'నిఖిత నారాయణ' తొలి చిత్ర అనుభవాల్ని ఇలా తెలియజేసింది.
* పదేళ్ళ వయసులో ఉన్నప్పుడు అనుకోకుండా 'అన్నపూర్ణ ఐయోడైజ్డ్‌ సాల్ట్‌' యాడ్‌లో యాక్ట్‌ చేసే అవకాశం లభించింది. ఆ ప్రభావం వలనో ఏమో యాక్టింగ్‌ అంటే ఆసక్తి ఏర్పడింది. 2009 లో 'డాబర్‌ మిస్‌ ఫ్రెష్‌ ఫేస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌' గా ఎంపిక కావడం, 2010 లో 'మిస్‌ సౌత్‌ ఇండియా' రన్నరప్‌గా నిలవడం..మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.
* బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ లో బ్యాచిలర్‌ డిగ్రీ తీసుకున్నాను. 'ఫేస్‌బుక్‌' లాంటి ప్రఖ్యాత సంస్థలో నెలకు లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం వచ్చింది. కానీ నా మనసు మాత్రం నటన వైపే మొగ్గు చూపింది. ముఖ్యంగా 'ఇట్స్‌ మై లవ్‌స్టోరి' చిత్రానికి జరిగిన స్టార్‌హంట్‌లో వందలాది అమ్మాయిల మధ్య హీరోయిన్‌గా నన్ను ఎంపిక చేయటం ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచింది.
* 'ఇట్స్‌ మై లవ్‌స్టోరి' చేస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఫేస్‌బుక్‌ జాబ్‌ వదులుకుని తప్పు చేశానా.. అనే చిన్న టెన్షన్‌ వెంటాడుతూ ఉండేది. కానీ 'ఇట్స్‌ మై లవ్‌స్టోరి' విడుదలై విజయవంతం అయ్యాక, అందులో నేను ప్లే చేసిన 'వందన' క్యారెక్టర్‌కు కాంప్లిమెంట్స్‌ లభించడం మొదలయ్యాక.... చాలా హ్యాపీగా ఫీలయ్యాను.
* ఫ్రెండ్స్‌ మరియు రిలేటివ్స్‌ ఇప్పుడంతా నన్ను నా పేరుతో పిలవడం మానేసి 'వందన' అని పిలుస్తున్నారు. పరిచయ చిత్రంతోనే పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్‌ ఉన్న హీరోయిన్‌ క్యారెక్టర్‌ లభించడం నిజంగా నా అదృష్టం. అయితే ఈ క్రెడిట్‌ అంతా మా డైరెక్టర్‌ మధుర శ్రీధర్‌కే చెందుతుంది. ఒక హిట్‌ సినిమాతో కెరీర్‌ ప్రారంభం కావడం చాలా గర్వంగా ఉంది. మా డైరెక్టర్‌ మధుర శ్రీధర్‌, మా ప్రొడ్యూసర్‌ యం.వి.కె.రెడ్డిలకు జీవితాంతం రుణపడి ఉంటాను.
* ముందు ముందు మరిన్ని వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నాను. 'ఇట్స్‌ మై లవ్‌స్టోరి'లో ట్రెడిషనల్‌ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా చాలావరకు సంప్రదాయబద్ధంగా నటించాను. అవసరమైతే ఆల్ట్రా మోడర్న్‌ క్యారెక్టర్స్‌ చేయడానికి సైతం వెనకాడను. తాజా చిత్రం ద్వారా లభిస్తున్న గుర్తింపు పట్టరాని సంతోషాన్ని కలిగిస్తోంది. 

Posted by mahaandhra on 1:24 PM. Filed under . You can follow any responses to this entry through the RSS 2.0

0 comments for సినిమా కోసం 'ఫే˜స్‌బుక్‌ ని వదులుకున్నా

Leave comment

Photo Gallery