అంతర్వేదిలో బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ... కథలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుండగా, ఆయన సరసన పాంచిబోరా, మనోజ్, దీక్షాసేథ్ జంటగా మంచు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'. శేఖర్‌రాజా దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సమర్పణలో ఈ చిత్రం ఇప్పటివరకూ 40శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. కాగా, గురువారం నుంచి రాజమండ్రి సమీపంలోని అంతర్వేది దేవాలయంలో బాలకృష్ణ పాల్గొననున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత లక్ష్మీప్రసన్న తెలియజేశారు. నాలుగురోజులపాటు ఈ చిత్రం షూటింగ్ అంతర్వేదిలో జరుగుతుందని చెప్పారు. ఈ చిత్రంలో బాలకృష్ణ నటించడం హైలైట్ అనీ, ఆయన పాత్ర కథలో ఎంతో విశిష్టతను పొందిందని ఆమె తెలిపారు.
ఈ చిత్రంకోసం హైదరాబాద్‌లో ఆరున్నర కోట్లు పెట్టి అతి పెద్ద ఫోర్‌సెట్‌ను రూపొందించడం జరిగిందనీ, డైరెక్టర్ దగ్గరుండి 9నెలలు శ్రమించగా, సెట్ రూపకల్పనలో ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరిగిందని ఆమె అన్నారు. పాటలు మినహా దాదాపు సినిమా మొత్తం ఆ సెట్లోనే షూటింగ్ జరుపుకుంటుందని ఆమె వివరించారు. మనదేశంలో ఎక్కడా లేనంత కళంకారీ ఆ సెట్ తయారు చేయడంలో ఉపయోగించబడిందని ఆమె చెప్పారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదలవుతుందన్నారు. ఇంకా సోనూసూద్, ప్రభు, రిషి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్, సంగీతం: బోబో శశి.

Posted by mahaandhra
on 6:57 PM.
Filed under
HighLights
.
You can follow any responses to this entry through the RSS 2.0