‘చేతి’లో కారు
పైకి ఒ క మాట...లోలోపల మరో బాట...తెలంగాణ ఇవ్వని కాంగ్రెస్‌ను ఈ ప్రాంతంలో ఖతం చేయా లని టీఆర్‌ఎస్ అధినేత కేసీ ఆర్ ఇప్పటికి పలు పర్యా యాలు చెప్పారు. రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరా మిరెడ్డి తోనూ అదే మాట చెప్పించారు. ఇప్ప టికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోతుందని టీఆర్‌ఎస్ నేతలు అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతారు...కానీ లోలోపల జరు గుతున్నది మాత్రం వేరు అని ఇటు టీఆర్‌ఎస్, అటు కాంగ్రెస్ వర్గాలు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నాయి. తెలంగాణ కోసం లోక్‌సభలో బైఠాయించి, నినాదా లు చేసి సభకు అంతరాయం కలిగించి వాయిదా పడేలా చేసిన కేసీఆర్ వ్యూ హం కేవలం పైపూత మాత్రమే అని, అంతర్గతంగా ఆయన ఆలోచన మరోలా ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. పైకి కాంగ్రెస్‌ను ఖతం చేయాలని చెబు తూనే కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నా రని విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమాచారాన్ని టీఆర్‌ఎస్ వర్గాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి.
తెలంగాణ ఇస్తే సై?...
పార్టీ వర్గాలే చెబుతున్న సమాచారం ప్రకారం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళటమే ఒక పకడ్బందీ వ్యూహంతో జరిగింది. తెలంగాణ కోసం భావ సారూప్యం కలిగిన శక్తులను కూడగడతామని, కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి పెంచుతామని చెప్పి ఢిల్లీ వెళ్లిన ఆయన రహస్యంగా కాంగ్రెస్ నాయకత్వంతో మంతనాలు జరుపు తున్నట్టు సమాచారం. ఈ ప్రయత్నంలో భాగంగానే రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో అపాయిం ట్‌మెంట్ కోసం కేసీఆర్ ప్రయత్నించి సరే అనిపించుకున్నారు. ఈ సమా వేశంలోనే విలీన మంత్రాంగం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌కు పూర్తిగా దాసోహం అన్నట్టు కాకుండా షరతులతో కూడిన చర్చలకు ఈ సమావేశం నాంది పలుకుతుందంటున్నారు.
హైదరాబాద్‌తో కూడిన తెలం గాణను ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరిస్తే ఇక ముందూ వెనకా చూడకుండా కాంగ్రెస్ మహా ప్రవాహంలో తన పార్టీని కలిపేసేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్టు ఢిల్లీలో, హైదరాబాద్‌లో సైతం రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సంవత్సరాంతానికి తెలంగాణ ప్రక్రియ ప్రారంభించి 2014 తొలి అర్ధ భాగానికి రాష్ట్ర ప్రకటన చేస్తామని కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇస్తే విలీనానికి తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్న షరతును అహ్మద్ పటేల్ ముందు కేసీ ఆర్ ఉంచబోతున్నారని చెబుతున్నారు.
శ్రేణుల గగ్గోలు...
ఒకవైపు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, ప్రముఖ నాయకులనూ పార్టీలో కి ఆకర్షిస్తూ మరోవైపు ఇలాంటి ప్రయత్నాలు చేయటమేమిటని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడిప్పుడే పార్టీ తెలంగాణలో పట్టు లేని ప్రాంతా లలో సైతం విస్తరిస్తుండగా ఉన్నపళంగా కేసీఆర్ ఈ ఆలోచన చేయటం పట్ల ద్వితీయ శ్రేణి నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ సమా చారమే నిజమైతే కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసించి ఇటీవల పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల గతి భవిష్యత్తులో అధోగతే అవుతుందని వారు అంటు న్నారు.
ఇటీవలే జూపల్లి కృష్ణారావు, రాజయ్య, సోమారపు సత్యనారాయణను కాంగ్రెస్ నుంచి, గంప గోవర్ధన్, జోగు రామన్నను టీడీపీ నుంచీ బయటకు తెచ్చి తన పార్టీలో కేసీఆర్ చేర్చుకున్నారు. ఆ సందర్భంగా వారందరికీ అత్యున్న తమైన భవిష్యత్తు ఉండేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అదీగాక విలీన సమాచారమే నిజమైతే గతంలో ఎన్నడూ కాంగ్రెస్ వాసన గిట్టని పాలమూరు మాజీ ఎంపీ ఎపి జితేందర్ రెడ్డి లాంటి వారు కచ్చితంగా పార్టీకి దూరమయ్యే అవకాశాలున్నాయని సీనియర్ నాయకులు చెబుతున్నారు. జితేందర్‌తో పాటు ఏనాడూ కాంగ్రెస్‌వైపు తొంగి చూడని నాయిని నరసింహారెడ్డి, ఈటెల రాజేం దర్, పొలిట్ బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్, గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి, బాన్స్ వాడ నుంచి ఘన విజయం సాధించిన పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి హేమా హేమీ నాయకుల పరిస్థితి ఏమవుతుందని ద్వితీయ శ్రేణి నేతలు ప్రశ్నిస్తున్నారు.
నాటి మాట ఏమైంది?
2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా 11 స్థానాలు మాత్రం గెలిచిన తర్వాత కేసీఆర్ ఒకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇక భవిష్యత్తులో ఏ పార్టీతోనూ పొత్తులాంటిది ఉండబోదని కరాఖండిగా చెప్పారు. ఒంటరిగా పోటీ చేసి తెలంగాణలో 100 అసెంబ్లీ, కనీసం ఏడు లోక్‌సభ స్థానాలు సాధించటమే ఇక ఇప్పటినుంచీ తమ వ్యూహం అని తేల్చి చెప్పారు. 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీతో పోటీ చేసినందుకు బుద్ధి వచ్చిందని, ఇక ఆ పొరపాట్లు మళ్ళీ చేయబోమని గట్టి హామీ ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్‌లో విలీనం అంటూ వ్యూహాన్ని మారిస్తే ప్రజల ముందు నవ్వులపాలు కాక తప్పదని ద్వితీయ శ్రేణి నాయకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు

Posted by mahaandhra
on 10:59 AM.
Filed under
HighLights
.
You can follow any responses to this entry through the RSS 2.0