హన్సిక....హ్మాపీ ఇక
దేశముదురు భామగా పరిచయమై తెలుగులో అవకాశాలు సన్నగిల్లడంతో తమిళ సీమలో కాలుమోపి అక్కడా విజయఢంకా మోగిస్తోంది హన్సిక. అక్కడ జనం ఏకంగా జూనియర్ కుష్బూ అంటూ హన్సికకు ఏకంగా బ్రహ్మరథం పడుతున్నారు. అరుుతే ఎప్పటిెకైనా తెలుగులో మంచి బ్రేక్ రావాలని ఆశిస్తున్న హన్సికకు ‘కందిరీగ’ రూపంలో మంచి హిట్ వచ్చిపడింది. అరుుతే ఆ చిత్రంలో బొద్దుగా ఉందనే పేరు తెచ్చుకుంది.
అరుునా అటువంటి విమర్శలను లెక్కచేయక తాజాగా సిద్దార్థతో కలిసి ‘ఓ మై ఫ్రెండ్గ’ చిత్రంలో కూడా నటించింది. అరుుతే ఆ చిత్రం కూడా హన్సికకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఓ మై ఫ్రెండ్గ చిత్రం కూడా యూత్ ను ఆకర్షిస్తూ స్టడీగా కలెక్షన్లను రాబడుతోంది. ఏది ఏమైనా హన్సికకు ఈ రెండు చిత్రాలు మళ్లీ టాలీవుడ్గలో కాలుమోపేం దుకు సహకరిం చాయనే చెప్పాలి. దీంతో హన్సిక ఆనంద పరవశురాలైపో తోంది. అరుుతే తెలుగు వారికి మరీ బొద్దందాల ను ఆదరిం చరనే సంగతి హన్సికకు తెలియదనుకుంటా!