అవునని గాని, కాదని కాని చెప్పలేను
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా విడగొట్టాలన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి ప్రతిపాదనపై బీజేపీ సీనియర్ నాయ కుడు ఎల్‌కే అద్వానీ అత్యంత చాకచక్యంగా ప్రతి స్పందించారు. ఏదైనా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే దానికి అవసరమైన చర్యలను జాగ్ర త్తగా నిర్వహించిన తరువాతే అది సాధ్యమన్నారు. అంతేగాని, రాష్ట్రాల విభజనపై తొందరపాటుతో నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. అయితే, ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా చేయాలన్న మాయావతి ప్రతిపాదనపై మాత్రం ఆయన సూటిగా స్పందించకుండా దాటవేశారు. అవినీతికి వ్యతిరేకంగా అద్వానీ నిర్వహిస్తున్న ‘జన చేతన యాత్ర’ కోసం ఉత్తరాఖండ్ వెళ్ళే ముందు ఆయన ఇక్కడ పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు.
‘మాయావతి ప్రతిపాదనకు అవునని గాని, కాదని కాని చెప్పలేను. ఈ అంశం గురించి జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. సమగ్రమైన చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది’ అని అద్వానీ వ్యాఖ్యానించారు. ‘ఈ ప్రతిపాదన వెనుక మాయా వతి ఆలోచన ఏమిటన్నదానిపై నేనేమీ వ్యాఖ్యానించ బోన’ని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ను పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, అవధ్‌ప్రదేశ్, పశ్చి మ్‌ప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించాలని ముఖ్యమంత్రి మాయా వతి ప్రతిపాదన లేవనెత్తిన విషయం తెలిసిందే.
అద్వానీకి బెదరింపుల ఆరోపణలపై ఒకరి అరెస్ట్
బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీకి కీడు చేస్తానంటూ బెదరిస్తున్న ఒక వ్యక్తిని గురు వారంనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి భార్యే స్వయంగా ఈ విషయం ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని షహ్రాన్‌పూర్‌కు చెం దిన క్షురకుడైన ఆ వ్యక్తి ప్రస్తుతం చండీగఢ్‌లో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆ వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఓ దేశవాళీ తుపాకీని తీసు కువచ్చి అద్వానీకి హాని చేస్తానంటూ బెదరిస్తు న్నాడని అతని భార్యే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం సాయంత్రం అద్వానీ జన చేతన యాత్ర చండీగఢ్ చేరుకుంది. ఈ నేపథ్యంలో బెదరింపులకు పాల్పడుతున్న క్షురకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

Posted by mahaandhra
on 10:25 AM.
Filed under
HighLights
.
You can follow any responses to this entry through the RSS 2.0