ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతులు
ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ‘మోస్ట్ పవర్‌ఫుల్ పీపుల్’ లిస్ట్‌లో వివిధ దేశాల అధినేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఐశ్వర్యవంతులు, సిద్ధాంత కర్తలతో పాట మత నాయకులు, నేరస్థులు కూడా ఉండడం విశేషం. వీరంత ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతులుగా వెలుగొందుతున్నారు. లక్షలాదిమందికి ప్రేరణగా నిలుస్తున్న ఇటువంటి 70మంది శక్తిమంతులతో ఫోర్బ్స్ మ్యాగజైన్ లిస్ట్ రూపొందించింది.
సోనియాగాంధీ
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతులైన వ్యక్తులలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 11వ స్థానాన్ని అలంకరించారు. దీంతో పాటు ఆమె ఫోర్బ్స్ పవర్‌ఫుల్ ఉమెన్ లిస్ట్‌లో 7వ స్థానాన్ని పొందడం విశేషం. దేశ మాజీ ప్రధాని అయిన స్వర్గీయ రాజీవ్ గాంధీ సతీమణి అయిన సోనియా 1997లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం యుపిఎ చైర్‌పర్సన్‌గా కీలకబాధ్యతలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని వెనుక ఉండి నడిపిస్తున్నారు.
మనవారు...
మన్మోహన్ సింగ్...

మన దేశ ప్రధాని మన్మోహన్ సిం గ్ ఫోర్బ్స్ జాబితాలో 19వ స్థానాన్ని పొందారు. 79 సంవత్సరాల మన్మోహన్ వరుసగా రెండవసారి దేశ ప్రధానిగా కొనసా గుతుండడం విశేషం. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అయిదు సంవత్సరాలుగా ప్రధానిగా పదవీకాలాన్ని పూర్తి చేసి మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఆయన.
లక్ష్మీ మిట్టల్....
ఎన్‌ఆర్‌ఐ లక్ష్మీ మిట్టల్ ఫోర్బ్స్ పవర్ పీపుల్ లిస్ట్‌లో 47వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 6వ స్థానం కూడా ఆయనదే కావడం విశేషం. లండన్‌లో నివాసముంటున్న ఆయన స్టీల్ మ్యా గ్నెట్‌గా ఎంతో పేరొందారు. ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్,ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఆయన కొనసాగుతున్నారు. ఆస్తుల విలువ 31.1 బిలియన్ అమెరికన్ డాలర్లు.
అజీమ్ ప్రేమ్‌జీ...
ఇండియన్ బిజినెస్ టైకూన్ అజీమ్ ప్రేమ్‌జీ విప్రో లిమిటెడ్ కంపెనీ చైర్మన్. ఈ వ్యాపారవేత్త ఫోర్బ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ పీపుల్ జాబితాలో 61వ స్థానంతో పాటు ఫోర్బ్స్ బిలియనీర్లలో 36వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఇక మనదేశంలోని అత్యంత సంపన్నులైన వారిలో అజీమ్ ప్రేమ్‌జీది మూడవ స్థానం. ఆయన ఆస్తుల విలువ 16.8 బిలియన్ అమెరికన్ డాలర్లు.
ముఖేష్ అంబానీ...
మన దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ రిలియన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్. ఫోర్బ్స్ పవర్‌ఫుల్ పీపుల్ లిస్ట్‌లో 35వ స్థానాన్ని దక్కించుకున్న ఈ కుబేరుడు ఫోర్బ్స్ బిలియనీర్స్‌లో 9వ స్థానాన్ని అలంకరించడం విశేషం. ఆసియాలోని ఐశ్వర్యవంతులలో రెండవ స్థానంలో ఉన్న ముఖేష్ ఆస్తుల విలువ 27 బిలియన్ అమెరికన్ డాలర్లు.
రాజకీయ పార్టీల నేతలు...
మన దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 11వ స్థానంలో, చైనాలోని కమీషన్ ఫర్ పొలిటికల్ అండ్ లెజిస్టేటివ్ అఫైర్స్ సెక్రటరీ జో యాంగ్‌కాంగ్ 29వ స్థానంలో, చైనా సెక్రటేరియట్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఫస్ట్ సెక్రటరీ గ్జి జిన్‌పింగ్ 69వ స్థానంలో ఉన్నారు.
వ్యాపారవేత్తలు, ఐశ్వర్యవంతులు...
ఫోర్బ్స్ జాబితాలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్మన్ బిల్ గేట్స్ 5వ స్థానంలో, బెర్క్‌షైర్ హతవే సిఇఒ వారెన్ బఫెట్ 20వ స్థానంలో, టెల్మెక్స్ చైర్మన్ కార్లోస్ స్లిమ్ హెలుతో పాటు అతని కుటుంబం 23వ స్థానంలో, న్యూస్ కార్పొరేషన్ సిఇఒ రూపర్ట్ మరా్‌డ 24వ స్థానంలో ఉన్నారు. ఇక మన దేశానికి చెందిన రిలియన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 35వ స్థానంలో, అర్సెలార్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీమిట్టల్ 47వ స్థానంలో, విప్రో లిమిటెడ్ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ 61వ స్థానంలో ఉండగా ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ 58వ స్థానాన్ని అలంకరించారు.
మత నాయకులు, నేరస్తులు...
ఫోర్బ్స్ లిస్ట్‌లో 7వ స్థానంలో రోమన్ క్యాథలిక్ చర్చ్ పోప్ బెనెడిక్ట్ 16, 26వ స్థానంలో ఇరాన్ మత నాయకుడు అలీ హుస్సేనీ ఖొమేనీ, 51వ స్థానంలో టిబెట్ మతనాయకుడు దలైలామాలు ఉన్నారు. ఇక అంతర్జాతీయ నేరస్తులైన దావూద్ ఇబ్రహీం 57వ స్థానాన్ని , డ్రగ్ ట్రాఫికర్ జోక్విన్ గుజ్‌మన్ లోరా 55వ స్థానాన్ని పొందారు.
దేశాధి నేతలు...
ఫోర్బ్స్ మ్యాగజైన్ అత్యంత శక్తిమంతులైన వ్యక్తుల జాబితాలో అగ్రరాజ్యాల అధినేతలు అగ్ర స్థానాన్ని దక్కించుకున్నారు. వీరిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిస్థానాన్ని, రష్యా ప్రధాన మంత్రి వ్లాదిమిర్ పుతిన్ రెండవ స్థానాన్ని, చైనా అధ్యక్షుడు హ్యు జింటావ్‌లు మూడవ స్థానాన్ని జర్మనీ ఛాన్సెలర్ యాంజిలా మెర్కెల్ 4వస్థానాన్ని అలంకరించారు. యుకె ప్రధానమంత్రి డేవిడ్ కామరూన్ 10వ స్థానాన్ని, ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ 13 స్థానంలో ఉన్నారు.
ఇ ఈ జాబితాలో మన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ 19వ స్థానంలో, ఇటలీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనితో పాటు అతని కుటుంబం 21వ స్థానంలో, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రోస్సెఫ్ 22వ స్థానంలో, ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యహు 25వ స్థానంలో, ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్-ఇల్ 37వ స్థానంలో, సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ 6వ స్థానంలో ఉన్నారు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ ప్రధానమంత్రి రెసెప్ ఎర్డగన్ 48వ స్థానాన్ని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ అల్-నహ్యన్ 53వ స్థానాన్ని, జపాన్ ప్రధానమంత్రి యోషిహికో నోడ 62వ స్థానాన్ని, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెర 66వ స్థానాన్ని, రష్యా అధ్యక్షుడు డిమిట్రీ మెద్వెదేవ్ 59వ స్థానాన్ని సంపాదించారు.