అధోగతిలో రూపాయి
డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత దిగజారింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి విలువ గత 33 నెలల కనిష్ఠస్థాయిలో 53 మా ర్కును తాకింది. దేశీయ స్టాక్‌మార్కెట్లు కుప్పకూలడం, ఐరోపా రుణ సంక్షోభం వంటి పరిణామాల నేపధ్యంలో ఆయిల్ దిగుమతిదార్ల నుంచి డాలర్‌కుడిమాండ్ ఏర్పడి ఫలితంగా రూపాయి క్షీణతకు దారితీసింది. ఈరోజు ఫోరెక్స్ మార్కెట్‌లో తొలుత రూపాయి 51.43/44 వద్ద ప్రారం భమై తర్వాత క్రమేపీ పతనమవుతూ చివరికి 52.15/16 వద్ద ముగిసింది. ఇది శుక్రవారం నాటి క్లోజింగ్ 51.33/34తో పోల్చుకుంటే 1.58% క్షీణత. అలాగే 2009 మార్చి 5 తేదీ తర్వాత ఇదే అత్యల్పస్థాయి. గత ఆరు సెషన్లలో రూపాయ మొత్తం 203 పైసలు నష్టపోయంది. పోరెక్స్ మార్కెట్‌లో రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకునే సామర్థ్యం తక్కువని ఆర్థికశాఖ సీనియర్ అధికారి పేర్కొనడం రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపిందని ట్రేడర్లు తెలిపారు.
అయితే రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్‌బ్యాంక్ 51.79 ప్రారంభ ధర వద్ద డాలర్లను విక్రయించే అవకాశం వుందని అంటున్నారు. ఇదిలావుంటే దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీగా క్షీణించాయి. సెనె్సక్స్ 400 పాయింట్లకు పైగా నష్టపోయి 16 వేల పాయింట్ల దిగువన ముగిసింది.

