మా అబ్బాయి నిశ్చితార్థానికి రండి
డిసెంబర్ 1న జరగనున్న తన కుమారుని నిశ్చితార్థానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ ముఖ్యనేత చిరంజీవి ఆహ్వానించారు. చిరంజీవి కుమారుడు, సినీ హీరో రాంచరణ్ వివాహం.. కామినేని ఉపాసనతో జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీరి నిశ్చితార్థం జీవీకే ఫామ్‌హౌస్‌లో జరగనుంది. దానికి ఆహ్వానించేందుకు సీఎంను ఆయన క్యాంపు కార్యాలయంలో చిరంజీవి సోమవారం కలిశారు. తన ఢిల్లీ పర్యటన విశేషాలను సీఎంతో పంచుకున్నారు.

