Categories

Popular Posts

Blog Archive

సీబీఐ గుమ్మం ఎక్కేందుకు రంగం సిద్ధమవుతుందా?



దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆత్మబంధువుగా ముద్రపడి, ఆరేళ్లపాటు పరిపాలనకు సైతం ఆత్మగా మారిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కేవీపీ రామచంద్రరావు కష్టాల్లో పడ్డారా? ఆయన కూడా త్వరలో సీబీఐ గుమ్మం ఎక్కేందుకు రంగం సిద్ధమవుతుందా? నాటి నిర్ణయా ల్లో తెరవెనుక ఉండి చక్రం తిప్పిన ‘వైభోగాన్ని’, ఆదేశాలను అధికారులు సీబీఐకి పూసగుచ్చినట్లు చెబుతున్నారా? ఎమ్మార్‌ కంపెనీ మాజీ సీఈఓ తాజాగా సీబీఐకి ఇచ్చిన సమాచారంతో పాటు, ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ కూడా ఆత్మ బంధువుకు వివాదాలు చుట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో కేవీపీకి ఇక రాజకీయంగా కష్టాలు మొదలయినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయింది.

వైఎస్‌ హయాంలో తెరవెనుక ఉండి చక్రం తిప్పిన కేవీపీ రామచంద్రరా వుకు కష్టాలు మొదలయ్యాయి. ప్రధానంగా.. ఎమ్మార్‌ కేసు ఆయన తలనొ ప్పిలా పరిణమించింది. ఇప్పటికే.. బినామీలతో 18 విల్లాలు తీసుకున్నారన్న ఆరోపణలు, వాటిని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి దినేష్‌రెడ్డి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధిపతిగా ఉన్నప్పుడు జరిపిన విచారణ నివేదికలోనూ ఉటంకించారన్న ప్రచారం జరిగిన విషయం తె లిసిందే. దినేష్‌రెడ్డి ఇచ్చిన నివేదిక ఇప్పటికే సీబీఐ వద్ద ఉంది. దాని ఆధారంగానే విల్లాలు కొన్న వారికి నోటీసు జారీచేసింది.

ఇప్పుడు తాజాగా నాటి ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ (పీజెఎస్‌సీ) దుబాయ్‌ కంపెనీకి సీఈఓగా పనిచేసిన ఏ.జె.జగన్నాధన్‌ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో.. వైఎ స్‌, కేవీపీతో ఎమ్మార్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఆలబ్బర్‌, కోనేరు ప్రసాద్‌ భేటీ అయిన తర్వాతే హైదరాబాద్‌ అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీఐఐసీ వాటా తగ్గించి, ఎమ్మార్‌ వాటాను పెంచారని స్పష్టం చేశారు. బాబు హయాంలో ఎమ్మార్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, హోటళ్లలో ఎమ్మార్‌కు 51 శాతం, ఏపీఐఐసీకి ్క్ష్‌49 శాతంతో ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత బాబు ప్రభుత్వం పోయింది. దాదాపు నాలుగేళ్లు పనుల ప్రతిపాదనలు మూలనపడ్డాయి. అప్పుడే ఈ నలుగురు భేటీ అయి, ఒప్పందాన్ని మార్చుకున్నారని మాజీ సీఈఓ సీబీఐకి వివరించారు.

వారి భేటీ ఫలితంగానే 49 శాతం వాటా ఉన్న ఏపీఐఐసీ భాగస్వామ్యం 29కి పడిపోగా, 51 శాతం ఉన్న ఎమ్మార్‌ వాటా 74 శాతానికి పెరిగిందని జగన్నాధన్‌ సీబీఐకి డాక్యుమెంటు ఆధారాలతో వివరించారు. దీనితో జగన్నాధన్‌ వాంగూల్మం మేరకు సహజ విచారణ ప్రక్రియలో భాగంగా సీబీఐ కేవీపీని కూడా విచారణకు పిలిపించే అవకాశం లేకపోలేదంటున్నారు. ఎందుకంటే వైఎస్‌ భౌతికంగా జీవించి లేరు కాబట్టి, భేటీలో పాల్గొన్న కేవీపీని పిలిపించడం అనివార్యమంటున్నారు. అదీకాకుండా.. గాలి కేసులో కొండారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారం చేసుకుని శశికుమార్‌ను పిలిపించిన సీబీఐ ఆయన ఇచ్చిన వాంగ్మూలం మేరకు జగన్‌ను విచారణకు పిలిపించింది. ఇప్పుడు జగన్నాధన్‌ వాంగ్మూలం ఆధారం చేసుకుని కేవీపీని కూడా పిలిపించే అవకాశం లేకపోలేదంటున్నారు.

ఇప్పటికే ఆరేళ్ల కేవీపీ హవా వల్ల రాజకీయంగా నష్టపోయిన సొంతపార్టీకి చెందిన ఆయన ప్రత్యర్థులు అధిష్ఠానం వద్ద కేవీపీ సంపాదన, ఆస్తుల గురించి ఫిర్యాదులు చేశారు. వీహెచ్‌, మధుయాష్కీ వంటి సీనియర్లు గతంలో వాటిపై నివేదికలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా.. గాలి కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదయి, నేడో రేపో అరెస్టుకు సిద్ధమవుతున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి కూడా గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓఎంసీపై తీసుకున్న నిర్ణయాల వెనుక ఎవరున్నదీ వివరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అందులో సైతం ఆమె కేవీపీ పేరునే ప్రముఖంగా ప్రస్తావించినట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన ప్రమేయం ఏమీ లేదని, వైఎస్‌-కేవీపీ చెప్పినట్లే నడుచుకున్న తనను బలిపశువును చేస్తున్నారని శ్రీలక్ష్మి తన లేఖలో ఆవేదన వ్యక్తం చేసినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి

Posted by mahaandhra on 6:57 PM. Filed under . You can follow any responses to this entry through the RSS 2.0

0 comments for సీబీఐ గుమ్మం ఎక్కేందుకు రంగం సిద్ధమవుతుందా?

Leave comment

Photo Gallery