బాలీవుడ్ భామల్లో నంబర్‌వన్ ఎవరు?
బాలీవుడ్ భామల్లో నంబర్‌వన్ ఎవరు? అనే అంశంపై ఓ ప్రముఖ బాలీవుడ్ పత్రిక నిర్వహించిన సర్వేలో ‘కరీనాకపూర్ నంబర్‌వన్’ అని తేలిందట. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ. కానీ కరీనా మాత్రం ఈ విషయంపై చాలా జాగ్రత్తగా స్పందించారు. ‘‘నంబర్‌వన్ పొజిషన్ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. హిట్టొస్తే నంబర్‌వన్ అనడం, ఫ్లాపొస్తే పని అయిపోయిందనడం ఈ రంగంలో పరిపాటే. అందుకే నన్ను ఎవరైనా ‘నంబర్‌వన్’ అంటే పెద్దగా పట్టించుకోను.
అసలు ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఇలాంటి సర్వేలు నిర్వహిస్తారో కూడా నాకైతే తెలీదు’’ అన్నారు కరీనా. ఇంకా ఆమె చెబుతూ -‘‘ఈ సర్వే నిర్వహించిన సదరు పత్రిక వారు నా అభిప్రాయాన్ని కనుక అడిగి ఉంటే... నేను కత్రినాకైఫ్‌కే ఓటు వేసేదాన్ని. తను చాలా క్యూట్. కత్రినా నటన కూడా గమ్మత్తుగా అనిపిస్తుంది. ‘షీలా...’ పాటలో తను వేసిన స్టెప్స్ తదేకంగా చూడాలనిపించింది’’ అని కూడా పేర్కొన్నారు. ఇదిలావుంటే కరీనా వ్యాఖ్యలకు కత్రినా కూడా సంస్కారవంతంగానే స్పందించారు. ‘‘కథానాయికల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉందని చెప్పడానికే కరీనా అలా అని ఉంటారు.
నిజానికి ఏ విషయంలోనూ నేను కరీనాతో పోల్చుకోదగ్గ నటిని కాను’’ అని కత్రినా మీడియాతో చెప్పారు. పోటీపడే నాయికలందరూ వీరిలా ప్రవర్తిస్తే ఎంత బావుంటుందో కదా...!

Posted by mahaandhra
on 9:40 AM.
Filed under
feature,
HighLights
.
You can follow any responses to this entry through the RSS 2.0