Categories

Popular Posts

Blog Archive

అందుకే హట్ హట్‌గా కనిపించాను!

నభైయ్యవ దశకంలో నిషా ఎక్కించే మత్తు కళ్లతో యువ హృదయాలను కొల్లగొట్టిన భామ సిల్క్‌స్మిత. ఈ భామ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘డర్టీపిక్చర్’. ఈ చిత్రంలో విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇందులో తమిళంలో పాపులర్ అయినటువంటి ‘నాకు ముక నాకు ముక...’ అనే తమిళపాటని ఎటువంటి మార్పులు లేకుండా విద్యాబాలన్‌పై దర్శకుడు మిలన్ లుథ్రియా చిత్రీకరించాడు. ఈ పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో సినీ నటిగా నటించిన విద్యాబాలన్ హద్దులు దాటి అందాల ప్రదర్శన చేసిందని విమర్శలోస్తున్నాయి.

ఈ మధ్య విడుదలైన ‘డర్టీపిక్చర్’ ప్రచార చిత్రాల్లో విద్యాబాలన్ మరింత సెక్సీగా కనిపించడంతో ఆ విమర్శలు మరింత పెరిగాయి. దీని గురించి విద్యాబాలన్ విమరణనిస్తూ ‘‘ సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. ఇందులో గ్లామర్‌కు హద్దులు నిర్ణయించడం కష్టం. పాత్ర లేదా చిత్రాన్ని బట్టి గ్లామర్‌గా కనిపించక తప్పదు. ఇక ఈ చిత్రం గురించి చెప్పాలంటే ‘డర్టీపిక్చర్’లో నా పాత్ర గ్లామర్‌ను పండిచాలి. ఎంత వరకు గ్లామర్‌గా కనిపించాలో అంత వరకే నటించాను. కానీ అంతా అంటున్నట్టుగా ఎక్కడా హద్దుదాటి ఎక్సపోజింగ్ చేయలేదు’ అంటోంది.

Posted by mahaandhra on 9:39 AM. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0

0 comments for అందుకే హట్ హట్‌గా కనిపించాను!

Leave comment

Photo Gallery