మాల్యా.. ది కింగ్ అండ్ పాపర్
కింగ్‌ఫిషర్ ఒక విమానయాన సంస్థ. దాని మాతృ సంస్థ యుబి గ్రూప్. ఈ
గ్రూపులో కింగ్ ఫిషర్ సహా ఐదు సంస్థలున్నాయి. ఇవన్నీ లిస్టెడ్ కంపెనీలే.
వీటన్నిటి విలువ సంవత్సరం క్రితం సుమారు రూ. 45,000 కోట్లు. నేడది దానిలో
సగం - అంటే సుమారు రూ. 23 వేల కోట్లు. ఈ పతనానికి నేడు హద్దే లేనట్లుగా
కనపడుతోంది. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో నిన్నటివరకు రాజులా ఓ వెలుగు
వెలిగిన విజయమాల్యా అదే కింగ్‌ఫిషర్ తీవ్ర నష్టాల్లో చిక్కుకుంది. అనేక
విలాసాలతో కింగ్‌లా తూగిళ్లుతూ పేదరికపు (పాపర్) ఫోజు పెడుతున్నాడు
మాల్యా. ఒక్క మన్మోహనామిక్స్... అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్
తాలూకు రీగనామిక్స్.... బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరేట్ థాచర్ విధాన
సారమైన... థాచరిజం నుంచి మన ప్రపంచ బ్యాంకు మాజీ ఉద్యోగి అయిన ప్రధాని
అరువు తెచ్చుకున్నది... అది ఒకటే నేడు కింగ్ ఫిషర్‌కు దిక్కు.
ఉచిత భోజనం లేదనేది... థాచర్‌లూ... రీగన్‌ల ఉవాచ. మన ప్రభుత్వ గిడ్డంగుల్లో ధాన్యం మురిగిపోతున్నపుడు మన పాలకుల మాట కూడా ఇదే. కానీ, కింగ్ ఫిషర్, యుబి గ్రూప్ యజమాని విజయమాల్యాకు బహుశా ఈ సూత్రం వర్తించదు. ఆయనకు వర్తించేది - బెయిలవుట్ అనబడే క్లాసికల్ ఒబామా ఎకనామిక్స్. ఈ ఎకనామిక్స్ థాచర్, రీగన్‌ల కొనసాగింపే. కాకుంటే, బడా కార్పొరేట్ సంస్థల కష్టకాలంలో ఇది దానికి విస్తరింపు అంతే. కొండముదిరి ఊసరవెల్లి అయినట్లుగా. మించి, మన ప్రధానిగారి మాటల ప్రకారమే మన దేశంలో వున్నది క్రోనీ క్యాపిటలిజం. మరిక పొరపాటుకు తావులేదు. దివాలా బాట పట్టిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను ఆదుకొని తీరాలి. విలాసపురుషుడు విజయమాల్యా విలాపాలను వినితీరాలి. పేదవారికి ఒకపూట ఆకలి తీర్చడానికి అంగీకరించని నయా ఉదావాద మహా సిద్ధాంతాలు పెద్దవారికి మాత్రం అన్నిరకాల ఉద్దీపనలు, బెయిలవుట్లు, సబ్సిడీలు ఇస్తాయి.
నేడు ఈ విలాస పురుషుడు విజయమాల్యా ముద్దుబిడ్డ కింగ్ ఫిషర్ సంస్థ విమానాలకు ఇంధనం నింపుకునేందుకు డబ్బులేదు. గత కొంతకాలంగా ఈ సంస్థ విమానాలు గాలిలోకి ఎగిరే సత్తాలేక ఎక్కడివక్కడే ఆగిపోతున్నాయి. మొన్న శుక్రవారం నాడు అంటే నవంబరు 11న ఈ విధంగా 40 విమానాలు రద్దయ్యాయి. ఆదివారం మరో 40 విమానాలు రద్దయ్యాయి. ఇక 50 మంది పైలట్లయితే ఈ గొడవ తమకెందుకు అనుకున్నారో ఏమో, అనారోగ్యమని చెప్పి విధులకు హాజరు కావడంలేదు. విమానాలు రద్దయి ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతున్నారు.

Posted by mahaandhra
on 8:58 AM.
Filed under
HighLights
.
You can follow any responses to this entry through the RSS 2.0