చెన్నై వెళ్లిన సిబిఐ బృందం
గాలి జనార్ధన రెడ్డికి సంబంధించిన ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో
సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి అరెస్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
మంజూరు చేసినట్లు తెలిసింది. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా
విధులు నిర్వర్తిస్తున్న శ్రీలక్ష్మి ప్రస్తుతం శెలవులో ఉన్నారు. వైఎస్
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మి
ఒఎంసికి గనులను బద లాయించడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. సిబిఐ
తనకు లభించిన ప్రాథమిక ఆధారాలతో ఆమెను ఈ కేసులో నిందితురాలిగా చేర్చింది.
పలుమార్లు సిబిఐ ఆమెను విచారించింది. ఒఎంసి కేసులో ఇప్పటికే గాలి జనార్ధన
రెడ్డి, ఆయన సోదరుడు శ్రీనివాసరెడ్డిని అరెస్టయి అండర్ ట్రైలర్లుగా జైలులో
ఉన్నారు. తాజాగా శనివారం రాత్రి ఇదే కేసులో అప్పటి గనుల శాఖ సంచాలకులు
రాజగోపాల్‌ను సిబిఐ అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని
మరింత సమాచారం కోసం విచారిస్తోంది. సాధారణంగా ఏదైనా కేసు నమోదైన తర్వాత
తొంభై రోజుల్లో కోర్టులో ఛార్జిషీట్ పెట్టాల్సి ఉంది. వచ్చే నెల నాలుగు
లోపు ఒఎంసి కేసులో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని ఇప్పటికే సిబిఐ జాయింట్
డైరెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఒఎంసి కేసులో మరో
నిందితురాలైన శ్రీలక్ష్మిని అరెస్టు చేసేందుకు సిబిఐ అధికారులు ప్రయత్నాలు
ముమ్మరం చేశారు.
శ్రీలక్ష్మి శెలవు ఈ నెల 9వ తేదీతో ముగిసినా విధులకు హాజరు కాకుండా మళ్లీ శెలవు పొడిగించుకున్నారు. అరెస్టును ముందుగానే ఊహించి ఆమె శెలవును పొడిగించినట్లు సమాచారం. అయితే ప్రభుత్వమే ఆమె శెలవును పొడిగించినట్లు తెలిసింది. ఐఎఎస్ అధికారిని అరెస్టు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అందుకే సిబిఐ అధికారులు ఆమె అరెస్టుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది. విచారణ సందర్భంగా గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ ఇచ్చిన వాంగ్మూ లం, సమాచారం ఆధారంగానే శ్రీలక్ష్మిని అరెస్టు చేయాలని నిర్ణయించినట్లు తెలి సింది. శశికుమార్ ఇచ్చిన వాంగ్మూ లంలోనూ శ్రీలక్ష్మి పాత్ర వెలుగులోకి వచ్చి నట్లు తెలిసింది. పక్కాగా ఆధారాలు సేకరిం చిన తర్వాత సిబిఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) పంకజ్ ద్వివేదితో సంప్రదింపులు జరిపినట్లు సమా చారం. చివరికి ప్రభుత్వం, సిఎస్ నుండి సూచనా ప్రాయంగా అనుమతి లభించిన తర్వాత అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. శ్రీలక్ష్మి చెన్నైలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అదనపు ఎస్‌పి ఎంఆర్ ఖాన్ నేతృత్వంలో ఎనిమిది మందితో కూడిన బృందం చెన్నై వెళ్లింది. శ్రీలక్ష్మి అరెస్టుకు గ్రీన్ సిగల్ ఇచ్చిన ప్రభుత్వం అరెస్టు అనివార్యం కావడంతో సాంకేతికంగా ఆమె శెలవు పొడిగింపునకు ఆమోదం తెలిపిందని సమాచారం. మరోపక్క శ్రీలక్ష్మి చూస్తున్న వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ బాధ్యతలను జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) డైరెక్టర్ లోకేశ్ కుమార్‌కు ప్రభుత్వం అప్పగించినట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి స్థాయిలో ఈ నిర్ణయం జరిగిందని, త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం. బాధ్యతల మార్పు తాత్కాలికమేనని ప్రభుత్వ వర్గాల భోగట్టా. ఒఎంసికి గనులను కేటాయిం చడంలో శ్రీలక్ష్మి కీలక పాత్ర పోషించారన్నది ప్రధాన ఆరోపణ. గాలి ఉక్కు కర్మాగారం నెలకొల్పుతున్నారనే పేర గనుల లీజు కోరుతూ వచ్చిన ఇతర దరఖాస్తులను శ్రీలక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా పక్కన పెట్టారు. గాలికి గనులను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గాలికి గనులివ్వాలని ప్రభుత్వం లోని కొందరు ముఖ్యులతో పాటు పై అధి కారుల నుండి ఒత్తిళ్లు వచ్చాయని రాజగో పాల్ సిబిఐకి వెల్లడించినట్లు సమాచారం. గాలికి గనులను కేటాయిస్తూ శ్రీలక్ష్మి పేరుతో ఉత్తర్వులు జారీ కావడంతో సిబిఐ ఆమెను నిందితురాలిగా పేర్కొంది. ఒఎంసి కేసులో ప్రస్తుత హోం మంత్రి, అప్పటి గనుల శాఖ మంత్రి సబితారెడ్డిని సిబిఐ అధికారులు ఇప్పటికే విచారించారు. సబిత పాత్ర కూడా ఉందని సిబిఐ ప్రాథమికంగా నిర్ధారించినట్లు భోగట్టా. గాలి తవ్విన ఖనిజాన్ని రవాణ చేసేందుకు సబిత అప్పట్లో బినామీ కాంట్రాక్టును పొందారని సిబిఐ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ విషయాన్ని గాలి సోదరులతో పాటు, రాజగోపాల్ కూడా సిబిఐకి వెల్లడించినట్లు తెలిసింది.

Posted by mahaandhra
on 8:56 AM.
Filed under
HighLights
.
You can follow any responses to this entry through the RSS 2.0