Categories

Popular Posts

Blog Archive

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌:టీడీపీ


తెలంగాణాపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ను బట్టబయలు చేసి, దానిని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని తెలుగుదేశం తెలంగాణా ఫోరం నిర్ణయించింది. ప్రధాని ప్రకటనతో ఇరుకునపడ్డ ఆ రెండు పార్టీలనూ ప్రజల ముందు దోషిగా నిలబెట్టి, తమ చిత్తశుద్ధి చాటుకునేందుకు టీడీపీ కార్యాచరణ రూపకల్పనలో ఉంది. అందులో భాగంగా తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వద్ద తెలంగాణా సీనియర్లు చర్చలు జరిపారు. తెలంగాణా అంశంతోపాటు ప్రజా సమస్యలపై కూడా పాదయాత్ర చేయాలని బాబు సూచించగా నేతలు అంగీకరించినట్లు సమాచారం.

మరో రెండు మూడు రోజుల్లో జరగనున్న విస్తృతస్థాయి సమావేశంలో పాదయాత్ర తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటుపై ప్రధానమంత్రి చేసిన ప్రకటన పార్టీకి బలమైన ఆయుధంగా తెలుగుదేశం పార్టీ భావిస్తున్నది. ఇప్పటిదాకా తెలంగాణ విషయంలో టీడీపీని తప్పు పట్టిన కాంగ్రెస్‌ పార్టీ నైజాన్ని ఈ ప్రకటన నేపథ్యంలో ఎండగట్టాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని టీటీడీపీ ఫోరం నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాక తెలంగాణను ఇచ్చేదీ, తెచ్చదీ తామే అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చెబుతూ వచ్చారని, ప్రధాని ప్రకటన నేపథ్యంలో వారికి ముఖం చెల్లకుండా చేయాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం.

కాంగ్రెస్‌ నైజాన్ని గురించి టీడీపీ ఎప్పటినుంచో చెబుతున్న అంశాలను ప్రజల్లోకి కీసుకు వెళ్ళి ఎండగట్టాలని సూచించారు. అదే సమయంలో కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్‌కున్న చీకటి ఒప్పందాన్ని వివరించండని టీడీడీపీ ఫోరం నేతలకు సూచించారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో సమావేశమైన టీటీడీపీ నేతలతో ఆయన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏ అవకాశం చిక్కినా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీల కు టీడీపీపై విరుచుకు పడటం అలవాటైందని, ప్రధాని ప్రకటన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఏమి చెబుతుందని ప్రశ్నిం చాలని అన్నట్టు తెలిసింది. టీడీపీ ఫోరం ఎమ్మెల్యేల రాజీ నామాలపై సైతం సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమా చారం. అయితే దీనిపై పట్టు పట్టవద్దని, ప్రస్తుతం సాగిస్తున్న ఉద్య మాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళి పార్టీని బలోపేతం చేసేం దుకు ప్రయత్నించా లని చంద్రబాబు అన్నట్టు తెలిసింది.

తెలంగాణ అంశంలో పార్టీ నిర్ణయం చాల స్పష్టంగా ఉందని, ఇదే అంశాన్ని ప్రజలకు తెలియజేప్పడంలో పార్టీ నేతలు విఫలమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలే కలిసి తెలంగాణ ప్రజలను మోసగిస్తున్నాయన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని సూచించారు. అప్పుడే ప్రజలకు వాస్తవాలేమిటో తెలుస్తాయని పేర్కొన్నారు.

Posted by mahaandhra on 2:18 PM. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0

0 comments for కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌:టీడీపీ

Leave comment

Photo Gallery