Categories

Popular Posts

Blog Archive

అమెరికాలో కొత్త సంక్షోభం.


అగ్రరాజ్యం అమెరికాకు ఇపుడు మరో చిక్కొచ్చింది. ఇప్పటిదాకా ఇంటిరుణాలు, కారు రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలతో ఆర్థికంగా అతలాకుతలమైన ‘సూపర్ పవర్’ సరికొత్త సంక్షోభంలో పడింది. మునుపెన్నడూ లేని విధంగా 1.3 ట్రిలియన్ డాలర్లు(దాదాపు ₹65 లక్షల కోట్లు) విద్యారుణాలు వసూలు కాక తిప్పలు పడుతున్నది. అమెరికా స్థూల జాతీయోత్పత్తిలో ఇది దాదాపు పదో శాతం కావడం అక్కడి చట్టసభ్యులను కలవరపరుస్తున్నది. చదివిన చదువులకు సరైన ఉద్యోగాలు దొరక్కపోవడంతో దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఆ రుణాలను తిరిగి చెల్లించలేక డిఫాల్టర్లు(బాకీదారులుగా) మిగిలిపోతున్నారు. తీవ్ర నిరాశ నిస్పృహలతో కుంగిపోతున్నారు. పెట్టుబడి, దాని ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ.. ఇటీవల మొదలైన ‘ఆక్యుపై వాల్‌వూస్టీట్’ ఉద్యమంలో ఎక్కువమంది ఆ విద్యార్థులే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
ప్రభుత్వం ఏం చేస్తున్నది?
ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న ఈ రుణాల చెల్లింపుకోసం గత నెలలో అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉపశమన సూత్రం పఠించారు. రుణ చెల్లింపునకు సంబంధించి ప్రస్తుతం ఉన్న విధానంలో కొన్ని మార్పులను ప్రకటించారు. రుణాలు తిరిగి చెల్లించేందుకు ఉన్న మొత్తం వ్యవధి 25 ఏళ్లను 20 ఏళ్లకు కుదించారు. తీసుకున్న రుణంలో ప్రతిఏటా చెల్లించాల్సిన 15 శాతం వాయిదాను పదిశాతానికి తగ్గించారు. ఆ తర్వాత 5 ఏళ్లకు రుణాన్ని మాఫీ చేస్తారు. ఇందుకు సంబంధించి ఒబామా గత నెలాఖరులో జరిగిన ఓ సభలో బహిరంగ ప్రకటన చేశారు.

ఒక్కొక్కరిపై 30వేల డాలర్ల రుణం
రుణాలు తీసుకున్న వారిలో 2010లో 7 శాతం మందే ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య 8.8 శాతానికి పెరిగిపోవడం అక్కడ ఆర్థిక ప్రమాద సూచికలను ప్రతిబింబిస్తున్నది. అంతేకాకుండా అక్కడ ప్రైవేట్ కాలేజీలకు, ప్రభుత్వ కాలేజీలకు ఫీజుల్లో మూడున్నర రెట్ల తేడా ఉండడం కూడా ఒక కారణమైంది. ప్రభుత్వం నడుపుతున్న కాలేజీల్లో బోధనా ఫీజులు దాదాపు 8244 డాలర్లు ఉండగా, ప్రైవేట్ రంగంలో అది 28,500 డాలర్లుగా ఉంది. అదే యూరప్ దేశాల్లో ఈ ట్యూషన్ ఫీజులు కేవలం 1200 డాలర్లు మాత్రమే ఉండడం అమెరికా విద్యావ్యవస్థలో ప్రేవేట్ రంగ ఆధిపత్య ధోరణికి అద్దం పడుతున్నది. గత ముపె్పై ఏళ్ల కాలంలో ట్యూషన్ ఫీజులు 439 శాతం పెరిగిపోవడంతో సామాన్య అమెరికా విద్యార్థులపై రుణభారం మరింత అధికమైంది. సగటున ఒక్కో విద్యార్థిపై దాదాపు 30 వేల డాలర్ల రుణభారం ఉందని గణాంకాలు వివరిస్తున్నాయి. అమెరికాలో ప్రస్తుతం ఉన్న కారుభకెడిట్ రుణాల కన్నా విద్యారుణాల మొత్తమే అధికం. అమెరికా స్థూల జాతీయోత్పత్తి (2011 లెక్కల ప్రకారం) 14.5 ట్రిలియన్ డాలర్లు కాగా, అందులో ఈ విద్యారుణాలు దాదాపు పదిశాతం(1.3 ట్రిలియన్ డాలర్లు ఉండడం గమనార్హం.)

Posted by mahaandhra on 2:19 PM. Filed under . You can follow any responses to this entry through the RSS 2.0

0 comments for అమెరికాలో కొత్త సంక్షోభం.

Leave comment

Photo Gallery