చిక్కుల్లో రామోజీరావు?
హైకోర్టు విచారణకు ఆదేశించడంతో ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావు
చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌పై తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పాటు రామోజీరావు, భువనేశ్వరి, నారా
లోకేష్ తదితరులపై విచారణ జరపాలని హైకోర్టు సిబిఐ, ఈడి, డిజిపి, హోం శాఖ
ప్రిన్సిపుల్ కార్యదర్శులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంోల
చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ముఖేష్ అంబానీ ముఖ్య అనుచరుడు నిమేష్
కంపానీలకు మధ్య గల సంబంధాలపై సిబిఐ, ఇతర సంస్థలు దృష్టి పెట్టే అవకాశం
ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రామోజీరావు, నిమేష్ కంపానీ
ప్రయోజనాలు పొందారని, అందుకు చంద్రబాబు అధికార దుర్వినియోగానికి
పాల్పడ్డారని విజయమ్మ తన పిటిషన్‌లో ఆరోపించారు.
తాను సొమ్ము కూడబెట్టుకోవడానికి, రామోజీకి ప్రయోజనం చేకూర్చడానికి మాత్రమే చంద్రబాబు పనిచేశారని, సీనియర్ అధికారుల సలహాలను కూడా పట్టించుకోలేదని విజయమ్మ ఆరోపించారు. తన పిటిషన్‌లో రామోజీకి, కంపానీకి మధ్య గల సంబంధాలపై ఆమె వివరించారు. కృష్ణా - గోదావరి బేసిన్‌లో చమురు తవ్వకాల హక్కును పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రామోజీకి, చంద్రబాబుకు మేళ్లు చేసిందని ఆమె అన్నారు. ఇదే విషయంపై పలు మార్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికలో వార్తాకథనాలు వచ్చాయి.
రామోజీ రావుకు, ఆయన కుటుంబడ సభ్యులకున చెందిన ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు 2,600 కోట్ల రూపాయల బాకీ పడిందని, దాన్ని తీర్చడానికి ముఖేష్ అంబానీ సహాయం చేశారని, అందుకు ఆయన హడావిడిగా 2007 - 2008 మధ్య ఆరు కంపెనీలను స్థాపించారని, రిలయన్స్ కార్పొరేట్ కార్యాలయం చిరునామాలోనే ఆ కార్యాలయాలు కూడా ఉన్నాయని, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆ కంపెనీలకు 2,504 కోట్ల రూపాయలను మళ్లించిందని విజయమ్మ పిటిషన్‌లో వివరించారు.
విజయమ్మ పిటిషన్‌లోని వివరాల ప్రకారం - ఆరు కంపెనీల్లోని రెండు కంపెనీలున ఈక్వేటర్ ట్రేడింగ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, అను ట్రేడింగ్ వాటాలను కొనుగోలు చేసే పేరుతో ఉషోదయాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అప్పుడు ఉషోదయా 59.19 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీల్లో వంద రూపాయల విలువ చేసే వాటాలను వాటాకు 5,28,630 ప్రీమియంతో ఆ రెండు కంపెనీలు కొనుగోలు చేశాయి. ఆ పెట్టుబడులు ముఖేష్ అంబానీ ముఖ్య అనుచరుడు నిమేష్ కంపానీ ద్వారా చేరాయి. ఈ స్థితిలో రామోజీ రావు పాల్పడిన అక్రమ ఆర్థిక లావాదేవీలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని విజయమ్మ పిటిషన్‌లో అన్నారు.

Posted by mahaandhra
on 8:55 AM.
Filed under
feature,
HighLights
.
You can follow any responses to this entry through the RSS 2.0