నేటి అరుదైన తేదీ 11.11.11
ఈ శతాబ్దిలోనే ప్రత్యేకమైన తేదీ శుక్రవారం కేలండర్‌లో ఆవిష్కారమవుతోంది.
ఆరు ఒకట్లతో (11.11.11) అరుదైన అంకెల విన్యాసం కనబడనుంది. ఇలాంటి అరుదైన
తేదీ ప్రతి శతాబ్దంలో ఒక్కసారే సంభవిస్తుంది. అందువల్ల దీన్ని శతాబ్ది
తేదీగా కూడా వ్యవహరిస్తారు. 1911, నవంబర్ 11న సంభవించిన ఈ తేదీ తిరిగి
మళ్లీ 2111, నవంబర్ 11న క్యాలండర్‌పై కనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన
విషయమేమంటే... నేడు 11 గంటల, 11 నిమిషాల, 11 సెకండ్ల సమయంలో డిజిటల్
క్లాక్‌లో వరుసగా 12 ఒకట్లు ప్రత్యక్షం కావడం. ఆ సమయంలో డిజిటల్ క్లాక్
11.11.11.11.11.11 అని కాలమనాన్ని ప్రదర్శించనుంది.