త్రిష తెలుగులో మళ్లీ బిజీ
ముద్దుగుమ్మ త్రిష తెలుగులో మళ్లీ బిజీ అయింది. వెంక సరసన ‘బాడీగార్డ్’తో పాటు తాజాగా ‘దమ్ము’ సినిమాలో ఎన్టీఆర్‌తో తొలిసారిగా జతకడుతోంది. ఈ చిత్రంలో ఈ సుందరితో పాటు కార్తీక కూడా మరో కథానాయికగా నటిస్తోంది. ఇద్దరు కథానాయికల చిత్రాలంటే ఎవరికి ఎంత ప్రాధాన్యత వుంటుంది అనే సందేహం రావడం సహజం. ఇదే విషయాన్ని ఈ భామ దగ్గర ప్రస్తావిస్తే...‘పరిక్షిశమలో నాకెవరూ పోటీకాదు. ఎవరి ప్రతిభకు తగ్గట్టు వారికి అవకాశాలు వస్తాయి. సినిమాలో నా పాత్ర ఏంటనే విషయాన్ని మాత్రమే నేను పట్టించుకుంటాను. ఇతర కథానాయికలతో నటించడానికి నాకెలాంటి ఈగో సమస్యలు లేవు. ప్రేక్షకుల్లో ఎవరికుండే ఇమేజ్ వారికుంటుంది’ అని చెప్పింది. అంతేకాదు ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలకే నా ప్రాధాన్యత అని అంటోంది ముద్దుగుమ్మ.
కన్నడ, మలయాళ చిత్రాల్లో వచ్చిన అవకాశాల్ని ఎందుకు వదులుకుంటున్నారని ప్రశ్నిస్తే...‘బహు భాషా కథానాయికగా పేరు తెచ్చుకోవాలన్న కోరిక నాకు లేదు. నాకెక్కడ సౌకర్యంగా వుంటుందో ఆ భాషాలోనే నటిస్తాను. ముఖ్యంగా నాకు కన్నడ, మలయాళ సినిమాలపై అంతగా అవగాహన లేదు. అదీగాక ప్రస్తుతం తెలుగు, తమిళంలో చాల బిజీగా వున్నానని’ చెబుతోంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘దమ్ము’ చిత్రంతో పాటు విశాల్ సరసన ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది.