అందంగా కనిపించడమే నా తప్పా
‘‘మా అమ్మానాన్న నన్ను అందగత్తెగా కన్నారు. నా అందం పక్కవారి అందానికి ప్రతిబంధకంగా మారితే నేనేం చేయను. ఇలాంటి ప్రమాదాన్ని సదరు వ్యక్తులు ముందుగానే గమనించి జాగ్రత్త పడాలి. నాకు అలాంటి పాలిటిక్స్ అంటే పరమ చిరాకు. నాకు చేతకాదు. చేతకాని వాళ్లే ఎదుటివారిపై రాజకీయాలు చేస్తారు.
కొంతమంది బాలీవుడ్‌లో నా గురించి బ్యాడ్‌గా ప్రచారం చేస్తున్నారని తెలిసింది. వారి మానసిక స్థితిపై నేను జాలిపడుతున్నాను’’ అని తనదైన శైలిలో స్పందించారు కాజల్. ‘‘నేను చాలా సెన్సిటివ్. నాలాంటి వాళ్లకు బాలీవుడ్ పెద్దగా సరిపడదని తేలిపోయింది.
అందుకే ఇక నుంచి ఖాళీ దొరికితేనే బాలీవుడ్ గురించి ఆలోచిస్తా. టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలపైనే ప్రస్తుతం నా దృష్టి అంతా’’ అని చెప్పుకొచ్చారు కాజల్. ప్రస్తుతం కాజల్ - మహేష్‌బాబు ‘ది బిజినెస్ మేన్’, చరణ్- వీవీ వినాయక్ చిత్రాలతో పాటు తమిళంలో సూర్య ‘మాట్రన్’, ధనుష్ ‘మారీశన్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

