Categories

Popular Posts

Blog Archive

మళ్లీ సినిమా టికెట్ రేటు పెంపు

సినిమా నిర్మాణానికి అయిన బడ్జెట్‌ని బట్టి టికెట్ల ధరలను రూ. 35 నుంచి రూ.100 వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని కోరాలని ఫిల్మ్ చాంబర్ ఏర్పాటుచేసిన సబ్ కమిటీ నిర్ణయించింది.దాంతో సగటు ప్రేక్షకుడు సినిమా చూడాలంటే తన బడ్జెట్ పై విపరీతమైన భారం మోయాల్సి ఉంటుంది.ఇక ఈ నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్లు చాంబర్ అధ్యక్షుడు డి. సురేశ్‌బాబు తెలిపారు.గతంలో పెద్ద బడ్జెట్ సినిమాలు విడుదలైనప్పుడు తొలి రెండు వారాల్లో పైతరగతి టికెట్ల ధరల్ని 75 శాతం పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.జై చిరంజీవ టైమ్ లో ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది.అందరూ అశ్వనీదత్ పై చిరంజీవిపై విమర్శలు చేసారు.అంతేగాక చిన్న నిర్మాతలు, ప్రేక్షకుల నుంచి కూడా నిరసనలు వ్యక్తం కావడంతో ఆ పద్ధతిని తీసేసి,ధరల్ని కొద్దిగా పెంచారు.మళ్లీ ఇప్పుడు సినిమాని బట్టి టికెట్ల ధరలు అనే ప్రతిపాదనను సినిమా పెద్దలు ముందుకు తెచ్చారు.

అయితే ఏ రేంజి బడ్జెట్ సినిమాకి ఏ మేరకు టిక్కెట్టు రేటు పెంచుకోవచ్చనే విషయం లో స్పష్టత రావాల్సి ఉంది.మరోవైపు సినిమా అనేది ఖరీదైన వ్యవహారంగా మారుతుండడంతోనే జనం పైరసీ సీడీల వైపు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఫిల్మ్‌చాంబర్ పెద్దల నిర్ణయం ఏ మేరకు సఫలం అవుతుందనే అనుమానం అందరిలో వ్యక్తమవుతోంది.మరి మొదట్నించీ టిక్కెట్ ధరల పెంపుని వ్యతిరేకిస్తున్న చిన్న సినిమాల నిర్మాతలు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో అని అంతా వేచి చేస్తున్నారు.మరో ప్రక్క డబ్బింగ్ సినిమాలపై కూడా ఓ రకంగా నిబంధనలతో కూడిన షరతులు విధించి వాటి తాకిడిని తప్పించాలని చూస్తున్నారు.ఏదో విధంగా తాము తీసే ఎలాంటి చిత్రాన్ని అయినా తెలుగు ప్రేక్షకులు భరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఈ నిర్ణయాలతో అందరికి కనపడుతోంది.

Posted by mahaandhra on 8:03 PM. Filed under . You can follow any responses to this entry through the RSS 2.0

0 comments for మళ్లీ సినిమా టికెట్ రేటు పెంపు

Leave comment

Photo Gallery