ఆస్తులు వెల్లడించిన ‘డీజీపీ’
రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి తన ఆస్తులను ప్రకటించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను వినేందుకు కేసు విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. దినేష్‌రెడ్డి సమర్పించిన ఆస్తుల వివరాలు పిటీషనర్ ఉమేశ్‌కుమార్‌కు అందుబాటులో ఉండేలా హైకోర్టు రిజిస్ట్రీల వద్ద ఉంచాలని కోర్టు సూచించింది. డీజీపీ ఆస్తుల వివరాలు ప్రకటించాలంటూ ఉమేశ్‌కుమార్ వేసిన పిటీషన్‌ను జస్టిస్ రమేష్ రంగనాథన్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. వెంటనే డీజీపీ తన ఆస్తుల వివరాలను ప్రకటించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో డీజీపీ ఆస్తుల వివరాలను కోర్టుకు అందించారు.

