Categories

Popular Posts

Blog Archive

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఈ నెలాఖరులోగా అరెస్టు చేసే అవకాశాలు

అక్రమ సంపాదన, గాలి జనార్దన్‌రెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఈ నెలాఖరులోగా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీబీఐ వర్గాల విచారణ తీరు, స్వయంగా జగన్‌ సైతం అందుకు మానసికంగా సిద్ధంగా ఉండటంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలో జగన్‌ స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోన్న ఆయన తల్లి విజయలక్ష్మితో పాటు భార్య భారతి ఇద్దరూ జనంలోకి వెళ్లి సానుభూతి సంపాదిం చుకునే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే ఒకసారి సీబీఐ విచారణకు హాజ రయిన జగన్‌ను వచ్చే వారంలో మరోసారి విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ నెలలో మూడు, నాలుగుసార్లు విచారించిన తర్వాత అందరి మాదిరిగానే జగన్‌ను అరెస్టు చేయవచ్చని వైఎస్సార్‌ పార్టీ నేతలు సైతం అంచనా వేస్తున్నారు. చివరకు పార్టీ అధ్యక్షుడు జగన్‌ కూడా తనను అరెస్టు చేయటం ఖాయమని, ఆ తర్వాత పార్టీని ఏవిధంగా నడిపించాలన్న అంశంపై తన కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం... ఈ నెలాఖరులోగా సీబీఐ తనను అరెస్టు చేయవచ్చని జగన్‌, మిగిలిన వారి మాదిరిగానే మూడు నాలుగుసార్లు పిలిపించి, చివరలో రొటీన్‌గా అరెస్టు జరగవచ్చని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, జగన్‌ తన అరెస్టు తర్వాత పార్టీ దెబ్బతినకుండా, నేతల ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండేందుకు మహిళా సెంటిమెంట్‌ అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా.. తల్లి ఎమ్మెల్యే విజయలక్ష్మి, భార్య భారతిని ప్రజల్లోకి పంపాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వారిద్దరినీ ప్రజల్లోకి పంపి బహిరంగసభలు, పాదయాత్రలు నిర్వహించడం ద్వారా సానుభూతి సంపాదించాలన్న వ్యూహంతో ఉన్నారు. ఇద్దరు మహిళలు రోడ్డెక్కి, తన కొడుకును వేధిస్తున్నారని తల్లి, తన భర్తను ఒంటరివాడిని చేసి ప్రభుత్వం అరెస్టు చేసిందని భార్య ఇద్దరూ ప్రజల్లోకి వెళితే ఆ సెంటిమెంట్‌ ఊహించని స్థాయిలో సానుభూతి సంపాదించి పెడుతుందన్న అంచనా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శిబిరంలో కనిపిస్తోంది.
వారిద్దరూ జనంలోకి వెళితే సానుభూతి పండుతుందని, అసలు జగన్‌ కంటే ఎక్కువ సానుభూతి దక్కుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కొడుకును వేధిస్తున్నారని ఒకరు, భర్తను రాజకీయంగా హింసిస్తున్నారని ఇంకొరు చెరో మూలకు వెళితే మహిళల్లో సానుభూతికి తిరుగు ఉండదని చెబుతున్నారు. ఆ వ్యూహంతోనే జగన్‌ సైతం తన అరెస్టు తర్వాత ఎవరు ఏవిధంగా వ్యవహరించాలన్న అంశంపై తల్లి, భార్యతో చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు జగన్‌ ఇప్పటినుంచే ఇద్దరు మహిళల పర్యటనల కోసం రంగం సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

తన అరెస్టు తర్వాత తల్లి, భార్యను రెండు ప్రాంతాలలో పర్యటించేలా చూస్తున్నారు. ఆ రకంగా రెండు ప్రాంతాల్లోనూ వీలయినంత ఎక్కువగా సానుభూతి సంపాదించుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. రెడ్డి, క్రైస్తవ ఓట్లు ఇప్పటికే గ్యారంటీ ఓటు బ్యాంకుగా భావిస్తున్న జగన్‌.. ప్రధానమైన మహిళా ఓటు బ్యాంకును కొల్లగొట్టాలంటే తల్లి-భార్య సెంటిమెంట్‌ సరైనదని భావిస్తున్నారు. తన అరెస్టు అనివార్యమని, ఆ తర్వాత పార్టీ ఎలా నిర్వహించాలో అన్న అంశంపై జగన్‌ పక్కా ముందస్తు ప్రణాళికతో వెళుతున్నట్లు ఆయన వైఖరి స్పష్టం చేస్తోంది

Posted by mahaandhra on 12:22 AM. Filed under . You can follow any responses to this entry through the RSS 2.0

0 comments for వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఈ నెలాఖరులోగా అరెస్టు చేసే అవకాశాలు

Leave comment

Photo Gallery