Categories

Popular Posts

Blog Archive

పేదల ఆహార భద్రతకే రూపాయికి కిలో బియ్య్చ్ఞం


రాష్ట్రంలో పేద ప్రజల ఆహారభద్రత  కోసం ఒక్క రూపాయికి కిలో బియ్యం పథకం ప్రారంభించి నట్లు  ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి  వెల్లడిం చారు.  ఒక రూపాయికి కిలో బియ్యం పథకాన్ని ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్‌ 1వ తేదీ మంగళవారం హైదరాబాద్‌లోని ఖైరతా బాద్‌ గణేష్‌ మండపం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు స్థానిక శాసన సభ్యులు, మంత్రి దానం నాగేందర్‌ అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాం గ్రెస్‌  ప్రభుత్వం  ఎల్లపుడూ పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తుందన్నారు. పేదలపార్టీ కాబట్టే ఆ పార్టీ  ప్రభుత్వంలో రూపాయికి కిలో బియ్యం ప్రారంభించినట్లు తెలిపారు. మనం ప్రారంభించే పనులు విఘ్నాలు కలుగకుండాచూడడానికి వినా యకుని ముందుగాపూజిస్తామని, అలాగే రూపా యికి కిలో బియ్యం విజయవంతం కావడానికి ముందుగా ఖైరతాబాద్‌ గణేష్‌ మండపం నుంచి ప్రారంభిస్తున్నామని ఆయన ప్రక టించారు. ఇదిసక్రమంగా అమలు జరగడానికి ప్రజలు ఫిర్యాదులుజిజి  చేసేందుకు టోల్‌ నంబరును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రచ్చబండ కార్యక్రమాల్లో 24 లక్షల నూతన కార్డులు ఇవ్వడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ఇవి ఇతర జిల్లాలవని, నగరానికి సంబంధించి లక్షా 68 వేల దరఖాస్తులు వచ్చాయని, ఈనెల 15వ తేదీ వరకు వాటి సర్వే పూర్తిచేసి నూతన కార్డులు ఇవ్వ డం జరుగుతుందన్నారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో రెండు కోట్ల 20 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరు తుందని ఆయన తెలిపారు. ఈ పథకంతో పాటు ఉద్యోగ జాతర పేరుతో లక్షా 16వేల ఉద్యోగాలను డిసెంబరు లోపు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే రాజీవ్‌ యువకిరణాలు ద్వారా 15 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు దేశం మొత్తంలో రూ. 22వేల కోట్లు ఇస్తే, ఇందులో రాష్ట్రంనుంచి 10వేలకోట్లు ఇవ్వడం జరిగిందన్నారు.
పూచీ లేకుండా ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకులు అప్పులు ఇచ్చాయంటే మహిళా సంఘాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో అర్దమవుతుందన్నారు. కాంగ్రెస్‌ మాట నిలబెట్టుకునే పార్టీ అని, అందుకే మహిళలకు పావలా వడ్డీ రుణాలు, యువకులకు ఉద్యోగాలు,ప్రజలకు ఒక్క రూపాయికి కిలో బియ్యం ఇలా ఎన్నొ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముం దుకు సాగుతుందన్నారు. ప్రజలు మా మంచి కార్యక్రమాలను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
పిసిసి అధ్యక్షులు, రవాణా మంత్రి బొత్స సత్య నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఒకరు తాము ప్రభుత్వంలో ఉండగా రైతులను పట్టించుకోకుండా ఇప్పుడు రైతు యాత్రలు చేస్తు న్నారని, మరొకరు ప్రభుత్వంలో ఉండగా పేదలను దోపిడీ చేసి ఇప్పుడు పేదల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని పరోక్షంగా జగన్‌, చంద్రబాబు లను విమర్శించారు.పౌరసరఫరాల మంత్రి శ్రీధర్‌బాబు మాట్లా డుతూ సోనియాగాంధీ ఆదేశాల మేరకు ముఖ్య మంత్రి రూపాయికి కిలో బియ్యం ప్రవేశపెట్టారన్నారు.మంత్రి దానం నాగేందర్‌ మాట్లా డుతూ పేదల సంక్షేమంపై చిత్తశుద్ది ఉన్న ప్రభుత్వం కాబట్టే ఎంత ఆర్దిక భారం మీదపడుతున్నా కూడా భరించడానికి సిద్దపడి రూపాయికి కిలోబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రులు రఘువీరారెడ్డి, గీతారెడ్డి, కాసు కృష్ణారెడ్డి, అహ్మదుల్లా, పితాని సత్యనారా యణ, ముఖేష్‌గౌడ్‌, ఎంపి అంజన్‌కుమార్‌ యాదవ్‌, మేయర్‌ కార్తీకరెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Posted by mahaandhra on 10:19 PM. Filed under . You can follow any responses to this entry through the RSS 2.0

0 comments for పేదల ఆహార భద్రతకే రూపాయికి కిలో బియ్య్చ్ఞం

Leave comment

Photo Gallery