పెనంమీద నుంచి పొయ్యిలో పడలేమని వ్యాఖ్య
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంశంపై ఏకాభిప్రాయానికి కృషి చేస్తున్నామని
ప్రధాని మరోసారి అన్నారు. మాల్దీవులు నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో
ప్రత్యేక విమానంలో ప్రధాని వివిధ అంశాలపై విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణా
అంశంపై ఆయన మాట్లాడుతూ..దీనిపై ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు జరిపామని
చెప్పారు. జాతీయస్థాయిలో ఏకాభిప్రాయం వచ్చిందని చెప్పలేమన్నారు. తెలంగాణ
అంశం సంక్షిష్ట మైనదని, దీనిపై ఆచితూచి అడుగేయాలని చెప్పారు. జాతీయ
సమస్యలకు 'పెనం మీద నుంచి పొయ్యిలో పడటం' సరైన సమాధానం కాదన్నారు. ఆ
రాష్ట్రానికి సంబంధించిన అందరిమధ్య ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తున్నామని
పునరుద్ఘాటించారు. ప్రశాంత పరిస్థితుల్లోనే పరిష్కారం లభిస్తుందన్నారు.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అశాంతి నెలకొనే పరిస్థితులున్నప్పుడు
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేమన్నారు. అందరికీ
ఆమోదయోగ్యమైన, ఆచరణా త్మకమైన పరిష్కారం కోసం అన్ని విధాలా
ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థలో నెలకొన్న
సంక్షోభంపై ఆయన మాట్లాడుతూ ప్రయివేటు విమానయాన సంస్థలు నిర్వహణలో సమర్థంగా
పనిచేయాల్సి వుంటుద న్నారు. విమానయాన శాఖ మంత్రితో మాట్లాడి ఈ సమస్యకు ఓ
పరిష్కారం చూస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి
రాహుల్‌గాంధీకి కొత్తగా ఏ బాధ్యత అప్పగించినా తాను స్వాగతిస్తానని ఓ
ప్రశ్నకు ప్రధాని బదులిచ్చారు.
నెమ్మదిగా తలసరి ఆదాయ వృద్ధి
ద్రవ్యోల్బణం ఎగబాకుతుండటం ఆందోళనకరమని ప్రధాని చెప్పారు. దీనిని తగ్గించేందుకు సమయం పడుతుందన్నారు. కాగా అంతర్జాతీ యంగా ముడి చమురు ధరలు పెరిగితే మరోమారు పెట్రో ఉత్పత్తుల ధర లు పెంచనున్నట్లు ప్రధాని సూచాప్రాయంగా చెప్పారు. మరోవైపు ఆర్థిక వృద్ధి రేటుతో పోలిస్తే తలసరి ఆధాయ వృద్ధి రేటు నెమ్మదిగా ఉందని ప్రధాని అంగీకరించారు. పాక్-భారత్ మధ్య సంబంధాలపై ప్రధాని మాట్లాడుతూ మరోమారు ఉగ్రవాద దాడి జరిగేందుకు అవకాశమివ్వరాదని ఇరుదేశాలు గుర్తించాయన్నారు. పాక్ సైన్యం శాంతి ప్రక్రియ దిశగా పయణిస్తోందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. భద్రతా దళాల ప్రత్యేక అధికారాలపై ప్రధాని మాట్లాడుతూ సైన్యంకానీ, పోలీసులుగానీ క్రియాశీల రాజకీయల్లో జోక్యం చేసుకోవడం అభ్యంతరకరమేనన్నారు.

Posted by mahaandhra
on 9:34 AM.
Filed under
feature,
HighLights,
News
.
You can follow any responses to this entry through the RSS 2.0