నీళ్లపాలైన నిధులు 1000 కోట్లు
ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మ కంగా ప్రారంభమైన ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం మూతపడేందుకు సిద్ధమైంది. మాజీ సత్తుపల్లి శాసన సభ్యులు జలగం వెంకట్రావు ఆధ్వర్యంలో 2004లో ఈ ఇందిరాసాగర్ ఎత్తి పోతల పధకానికి రూ.2000 కోట్లు మంజూరు చేయించారు. నియోజకవర్గంలోని రుద్రంకోట వద్ద గోదావరి నది మీద లిఫ్ట్ పాయింట్ పెట్టి, భారీ విద్యుత్‌మోటార్ల సాయంతో ఆ నీటిని పైకి తోడి ఖమ్మం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా ల్లోని 2 లక్షల ఎకరాలకు అదనపు సాగునీరం దించే విధంగా ఈ బృహత్తర పధకాన్ని రూపొం దించారు. ఈ పథకం ప్రారంభాన్ని నాయకులు ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావించారో ఆ తరువాత అమలు చేయటంలో అప్రదిష్ట పాలయ్యారు. ఇప్పటివరకు ఈ పథకం అమలు కోసం వెచ్చిం చిన రూ.1000 కోట్లకు పైగా నిధులు మట్టిపా లైపోయాయి.కోట్లు వృధాఅయినా కనీసం ఒక్క రైతుకు ప్రయోజనం చేకూరకపోవటం దురదృ ష్టకరం. ఈ పథకం అర్ధాంతరంగా నిలిచిపోవ డంతో పాలకులను ఈ ప్రాంత ప్రజలు అస హ్యించుకుంటున్నారు. కేవలం నేతల బొక్కసం నిండేందుకే ఈ పథకం అమలు చేశారనే విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి.దాదాపు 40 కిలోమీ టర్ల పరిధిలో అండర్‌గ్రౌండ్ పైపులు వేసేం దుకు భారీ వ్యాసార్ధంతో తయారు చేయబడిన ఒక్కో పైపు ఖరీదు లక్షల్లోనే ఉంది. కేవలం ఈ పైపులకు రూ. 600 కోట్లకు పైగా వెచ్చించారు. వాటిని భూమిలో అమర్చడానికి, ఈ ప్రదేశానికి రవాణా చేయడానికి, ఆ ప్రదేశంలో భూమిలో అమర్చేందుకు వినియోగించిన భారీ క్రేన్‌ల అద్దె లకు ఇలా అనేక చిల్లర ఖర్చులకు ఇప్పటిదాకా రూ.6కోట్లకుపైగా ఖర్చుపెట్టారు. పైపుల తయా రీకి అవసరమయ్యే ఇసుక, ఇనుము, వాటి రవాణా వీటిగురించి చెప్పేపనేలేదు. ఈప్రాజెక్టు కాంట్రాక్టు పొందిన మెగా సంస్థ వినాయకపు రంలో తాత్కాలిక క్యాంపుకార్యాలయాలు నిర్మిం చింది. దాంతోపాటు సిబ్బంది వేతనాలు, వారి నివాస రవాణా అలవెన్సులు వగైరా ఖర్చులు కూడా ఈ ఏడేళ్ళలో కోట్లకు చేరింది. రాజకీయ పార్టీల విరాళాలు, నేతల నజరానాలు, ఉండనే ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే రూ. 1000 కోట్లు దాటింది. ఇంత ఖర్చుచేసినా ఒక్క రూపా యికూడా అక్కరకు రాలేదు. మధ్యమధ్యలో రెండుచోట్ల పంపుహౌస్‌లనిర్మాణమంటూ హడా విడి చేశారు. భూసేకరణ జరిగింది. ఆయా రైతులకు లక్షలాదిజిజి రూపాయల నష్టపరిహారం ముట్టజె ప్పారు. పంపుహౌజ్‌ల నిర్మాణంతోపాటు దమ్మ పేట మండలం అంకంపాలెం సమీపంలో ఈ నీటితో ఇంకేముంది పవర్‌హౌస్ కూడా వచ్చేస్తుం దని హంగామా చేశారు. కానీ భారీ తవ్వకాలు, నాణ్యత లోపించిన అండర్‌గ్రౌండ్ ఫిటింగ్స్‌్, నేతల శిలాఫలకాలు తప్ప మరే గుర్తులూ లేవు. రుద్రంకోట మొదలుకుని అంకంపాలెం దాకా ఈ ఇందిరాసాగర్ ఎత్తిపోతల పేరిట భూములను నాశనం చేశారుతప్ప మరే ప్రయోజనం లేకుండా పోయింది.
ఇదిలా ఉంటే అశ్వారావుపేట మండలంనుంచి దమ్మపేట మండలంలోకి ఈ ఎత్తిపోతల కాలువ లను తవ్వే క్రమంలో అకంపాలెం, రెడ్డిగూడెం గ్రామాల మధ్యన కేంద్ర రిజర్వ్ ఫారెస్ట్ అనుమ తులు కావలసి వచ్చాయి. దీనికోసం గత పాల కుల హయాంలోనే ఢిల్లీ స్థాయిలో అనుమతుల కోసం తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. 2006 నుంచీ ఆ ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నా ఆ ఫైల్స్‌లో పురోగతిలేదు. వీటిని పట్టించుకున్న నాయకుడు లేడు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాలేదని 2009లోనే ప్రభాతవార్త ప్రముఖంగా వార్తలను బహిర్గతం చేస్తే, ఒక ప్రముఖ నేత ఖమ్మంలో విలేకర్ల సమావేశం పెట్టి ఈ వార్త నిజం కాదని, తెలుసుకుని రాయాలంటూ చిందులు తొక్కారు. కానీ ఈ రోజుకు కూడా ఇందిరాసాగర్ ఎత్తిపోతల కాలువల నిర్మాణానికి కేంద్ర రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులు రాలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మెగా కంపెనీ బాధ్యు లొకరు గురువారం ఈ విషయాన్ని స్పష్టంగా ధృవీకరించారు. ఇకముందు ఆ అనుమతులు రావడంకూడా కష్టమేనని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ భవిష్యత్తులో పోలవరం బ్యాక్‌వాటర్ వచ్చి ఈ ఎత్తిపోతల పనులు వేగ వంతం అవుతాయని ఆశకూడా దీంతో పోయిన ట్లయింది. ప్రస్తుతం నిధులన్నీ నిలిపివేశారు. కాంట్రాక్టర్లు తమ గుడారాలను ఒకటొకటిగా ఎత్తే స్తున్నారు. గురువారం నాటికి పూర్తిగా క్యాంపు ఖాళీ అయిపోయే పరిస్థితికి చేరుకుంది. కోట్లాది రూపాయల ఖరీదైన మోటార్లు, జనరేటర్లు తది తర మెటీరియల్ ఇంకా ఇక్కడి గోదాముల్లో ఉంది. వీటిని తరలించుకుపోయేందుకు గాను మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌కు చెందిన ముగ్గురు కీలక ఉద్యోగులు మాత్రం ఇక్కడ మిగిలి ఉన్నారు. రూ.1000 కోట్లకు పైగా ప్రజా ధనం మాత్రం హారతి కర్పూరంలా హరించుకు పోయింది.
